వైభవంగా వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు
చందానగర్,మేజర్ న్యూస్ : చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠం పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహిస్తున్న స్వామివారి 31వ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా, భక్తుల కన్నుల పండువగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అశోక్ గౌడ్, నాయకులు మిరియాల రాఘవరావు, రఘునందన్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాంగోపాల్, నాని, హరి, రాజన్, ఆయాజ్ ఖాన్, బబ్లూ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.