BREAKING
డిక్సన్ టెక్, దీపక్ నైట్రైట్ క్యూ2 ఫలితాలు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సవరించిన టార్గెట్ ప్రైస్, వృద్ధి అంచనాలు మోతీలాల్ ఓస్వాల్ క్యూ2 మధ్యంతర సమీక్ష: 12 త్రైమాసికాల్లోనే అత్యధిక లాభాల వృద్ధి, బీఎఫ్ఎస్ఐ మరియు లోహ రంగాల జోరు అజంతా ఫార్మా క్యూ2 రివ్యూ: అద్భుత పనితీరు కనబరిచినా ర్యాలీతో పరిమితమైన లాభాల పరిధి ముత్తూట్ ఫైనాన్స్ క్యూ2 రివ్యూ: లాభాలు పటిష్టంగా ఉన్నా నిర్మల్ బాంగ్ ఆచితూచి అడుగులు ఎఫ్‌పీఐల నిష్క్రమణ: పన్ను తగ్గింపు డిమాండ్ల పరిశీలనకు ఎఫ్‌ఎం సై స్టాక్ మార్కెట్ టుడే: నవంబర్ 3 ట్రేడింగ్‌కు ముందు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం జోరు: గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్ల జంప్, భారీ గ్యాప్-అప్ సంకేతాలు వైజాగ్ హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం: రంగంలోకి ఫైరింజన్లు, ప్రాణనష్టం తప్పడంతో ఊరట భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం: ప్రీమియం ఏసీ మార్కెట్‌లోకి అర్బన్ కంపెనీ ‘నేటివ్’: బడా బ్రాండ్లకు పోటీగా సరికొత్త ఉత్పత్తులు బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్

రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి.....

Select Suryaa Now
 రహదారిపై  ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి.....

                                మసీదుబండలో రహదారులు, కాలువల ఆక్రమణలపై అధికారులకు  ఫిర్యాదు
కొండాపూర్,మేజర్ న్యూస్ :  మసీదుబండ  పరిధిలోని సర్వే నంబర్‌ 169లో జరుగుతున్న నిర్మాణ పనులు, రహదారి ఆక్రమణలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మసీదుబండ ప్రజలు కోరారు. ఈ మేరకు సీఎంసీ,శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం,టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు సోమవారం ప్రజావాణిలో  పిర్యాదు చేశారు.ఈ సందర్బంగా హెచ్‌సీయూ బస్‌ డిపో నుంచి మసీదుబండ బొటానికల్‌ గార్డెన్‌ వరకు ఉన్న 100 అడుగుల రహదారి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని మసీదుబండ ప్రజలు ఆరోపించారు. 

మూడు సెల్లార్లతో కూడిన బహుళ అంతస్తుల భవన నిర్మాణంతో పాటు రహదారికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించే విధంగా ఇనుప రేకులతో కంచెలు, షెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలాగే ప్రభుత్వ నిధులతో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన 4.5 అడుగుల వెడల్పు కాలువలు, 100 అడుగుల రహదారి స్థలాన్ని ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 120 అడుగుల రహదారికి సంబంధించిన సెట్‌బ్యాక్‌ నిబంధనలు కూడా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.బిల్డర్‌కు మంజూరైన అనుమతులు, నిర్మాణ ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు, షెడ్లు, ఇతర ఆక్రమణలను తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు.

 ప్రభుత్వ రహదారులు, కాలువలు ప్రజల ప్రయోజనాల కోసమేనని, వాటిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మసీదుబండ ప్రజలు అధికారులకు  విజ్ఞప్తి చేశారు.స్పందించిన అధికారులు వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించి రహదారి, కాలువల ఆక్రమణలను పరిశీలించిన  నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని సంబంధిత బిల్డర్ ను హెచ్చరించారు.