అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్
మియాపూర్,మేజర్ : శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన 450 ఎంఎం పైప్‌లైన్ పనులు, బొల్లారం ప్రధాన రహదారి నుంచి గుర్నాధం చెరువు వరకు నిర్మిస్తున్న ఆర్‌సీసీ బాక్స్ డ్రైన్ పనులను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీ వాసులు, సీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. బాక్స్ డ్రైన్ నిర్మాణంతో వర్షాకాలంలో వరదనీటి సమస్య తగ్గుతుందని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్‌లోని కాలనీల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఈ ప్రశాంత్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు జగదీష్, నవీన్, కాలనీ వాసులు సాంబయ్య, బాలు నాయుడు తదితరులు పాల్గొన్నారు.