BREAKING
బ్యాంకింగ్ రంగంలో ఏఐ విప్లవం: ఆటోమేషన్‌తో గ్లోబల్ బ్యాంక్‌కు ఏకంగా 216 మిలియన్ డాలర్ల లాభం నేటి రాశి ఫలాలు –3 నవంబర్, 2026 నేటి పంచాంగం 3 నవంబర్, 2026 పీ అండ్ జీ హెల్త్ త్రైమాసిక ఫలితాల్లో దూకుడు: నికర లాభం 26 శాతం వృద్ధి, రూ. 112 కోట్లకు చేరిక ఎస్‌వైఆర్‌ఎంఏ ఎస్‌జీఎస్ దూకుడు.. ఎఫ్‌వై27 వృద్ధి అంచనాలు 40-45 శాతానికి పెంపు, రూ. 7,000 కోట్ల టార్గెట్ కుటుంబ కలహాలతో వాటర్ ట్యాంక్ ఎక్కిన వివాహిత మానకొండూరులో కలకలం అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్ గంజాయి స్మగ్లర్‌పై పీడీ యాక్ట్! ఐదేళ్లలో ఐదు కేసులు.. మూడు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ అమిత్ షా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి బీజేపీ శ్రేణులు రహదారిపై ఆక్రమణలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి..... పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి మియాపూర్ ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు ప్రత్యేక అవసరాల పిల్లలకు మండల స్థాయి క్రీడా పోటీలు వైభవంగా వెంకటేశ్వర స్వామి 31వ బ్రహ్మోత్సవాలు మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం.

Select Suryaa Now
బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం.

హిమాయత్ నగర్ , మేజర్ న్యూస్ :వెలుగుల పండుగ ఈ దీపావళి మనందరి జీవితంలో సరికొత్త వెలుగులు , ఆశలు నింపి మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అన్నారు. సోమవారం చేలాపుర బ్రహ్మకుమారిస్ శాఖ ఆధ్వర్యంలో  శాలిబండ సుధా టాకీస్ సమీపాన గల భారత్ గుణవర్ధక సంస్థ సమావేశ మందిరంలో దీపావళి స్నేహ సమ్మేళనం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగలలో ఒకటైన దీపావళిని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో మనమందరం జరుపుకుంటామని వివరించారు.
చేలాపుర బ్రహ్మకుమారిస్ శాఖ పరిపాలకురాలు రజనీ సోదరి మాట్లాడుతూ ఆత్మ జ్యోతిని వెలిగించుకుని పరమపిత పరమాత్మ శివుని స్మృతిలో జీవించడమే దీపావళి పండుగ అసలైన ఆనందమని అన్నారు. హిమాయత్ నగర్ శాఖ బ్రహ్మకుమారిస్ పరిపాలకులు బ్రదర్ ఆనంద్ విచ్చేసి రాజయోగ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో రజిని సోదరి, శిరీష సోదరి,శక్తి సోదరి ప్రశాంత, సవిత సోదరి తదితరులు మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ మనలోని ఆత్మ జ్యోతిని వెలిగించుకొని పరమాత్మ స్మృతిలో ఉంటూ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు ఆనందం నింపుకోవాలని సందేశం ఇచ్చారు. దీపావళి వేడుకల్లో భాగంగా ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది దీపావళి సమ్మె స్నేహ సమ్మేళనంలో పాతబస్తీలోని వివిధ బ్రహ్మకుమారి శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు