ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు
డాక్టర్ సజ్జా వెంకటేష్ ను సత్కరించిన నాదెళ్ల పాపారావు
కూకట్ పల్లి, మేజర్ న్యూస్:ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని పోలీస్ డి హాస్పిటల్ వైద్యుడు సజ్జ వెంకటేష్ సూచించారు. మహీంద్రా అశ్విత సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఇందులో భాగంగానే హాట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ల మధ్య వ్యత్యాసం విషయాన్ని వివరించారు. మహీంద్రా అశ్విత లో నివసిస్తున్న వారితోపాటు సీనియర్ సిటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 24/7 సేవల గురించి పలు విభాగాల పై స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా మహేంద్ర అశ్విత సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సజ్జ వెంకటేష్ ను అందంగా సత్కరించారు.