BREAKING
విద్యార్థుల్లో బిసి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాం :మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు మియాపూర్ 550 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకే కేటాయించాలి నివాసితులకు ఇంటి పట్టాలివ్వాలి మియాపూర్ భూములను ఉద్యమకారుల కుటుంబాలకు కేటాయించాలి.... గోపీనగర్ లో వెలగని వీధిదీపాలు.... పట్టించుకోని అధికారులు. బొప్పలి వెంకటేష్ యాదవ్‌కు సేవారత్న అవార్డు పరిశుభ్రతపై సీఎంసీ దృష్టి.. మాంసం దుకాణాలు, డెయిరీ ఫారాలపై అధికారుల తనిఖీలు యాదగిరి నగర్‌లో సీవరేజ్ పనులకు శ్రీకారం నీటి సంరక్షణలో భాగస్వాములుగా 437 మంది వాటర్ వారియర్లు గండిపేట కాండ్యూట్‌పై చురుగ్గా మరమ్మతు పనులు : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అయోధ్యలో బాలరాముడికి తెలంగాణ గవర్నర్ ప్రత్యేక పూజలు ఎమ్. ఎల్. ఏ., మర్రి రాజ శేఖర్ రెడ్డి కీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బోహ్రా కమ్యూనిటీ సభ్యులు. డిస్ట్రిక్ట్ మరియు ఎయిర్‌టెల్ మధ్య సహకారం ఎస్‌ఆర్ నాయక్ నగర్‌లో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి..పాత విద్యుత్ లైన్ల స్థానంలో ఏబీ కేబుళ్లు ఏర్పాటు చేయాలి.. ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..వరగాని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు..

Select Suryaa Now
కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు..

నిజాంపేట్ మేజర్ న్యూస్ :కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్‌కు చెందిన 8, 9వ బ్లాకుల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. గతంలో ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఉత్తర్వుల మేరకు సంబంధిత అధికారులు సమగ్ర చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, హైడ్రా అధికారులు చర్యలు చేపట్టడంలో జాప్యం చేస్తున్నారని ఆకుల సతీష్ ఆరోపించారు. 

వివాదాస్పద హెచ్‌ఎండీఏ ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని నిర్మాణ పనులు తిరిగి కొనసాగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జాయింట్ సర్వే నిర్వహించాలని హైడ్రా అధికారులు ఏప్రిల్‌లోనే సంబంధిత శాఖలకు లేఖలు రాసినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేకపోవడంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా బాచుపల్లి సాయినగర్‌లోని సర్వే నంబర్ 186లో సుమారు 11 గుంటల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించిన నేపథ్యంలో, ఆ స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురికాకుండా రక్షించాలని కోరారు.

 ప్రజా అవసరాల కోసం ఆ స్థలాన్ని కమ్యూనిటీ అవసరాలకు కేటాయించాలని మరో ఫిర్యాదు సమర్పించారు. కొంపల్లి సర్వే నంబర్ 100లోని ఆర్మీ భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణలపై గతంలో నిర్వహించిన సర్వే నివేదికను ఇప్పటివరకు అందించకపోవడంపై కూడా విచారణ జరిపించాలని కోరారు. సర్వే నివేదికను వెంటనే అందజేయడంతో పాటు ఆక్రమణలు జరిగినట్లు తేలితే ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తుల పరిరక్షణలో సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యం వీడి, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆకుల సతీష్ కోరారు. ప్రజా ఆస్తులను కాపాడేందుకు సమన్వయంతో పనిచేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, మాధవ రావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.