ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర
పెద్ద ఎత్తున తరలివెళ్లిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: ప్రజాస్వామ్య పరిరక్షణకోసం, అరాచకవాదుల పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన మహా పాదయాత్రకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ మహా పాదయాత్రలో పాల్గొనేందుకు శ్రీకృష్ణనగర్ డివిజన్ పరిధిలోని వెంకటగిరి నుంచి బీజేపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి పులి రామ్మోహన్, నగర ఉపాధ్యక్షుడు కుంబాల గంగరాజు, బరిగెల జ్ఞానేశ్వర్, బడుగు సతీష్, కృష్ణానగర్ డివిజన్ అధ్యక్షుడు ఫణిల్ కుమార్, దొండీ గణేష్, విశ్వేశ్వర రెడ్డి, మోహన్, క్రాంతితో పాటు మహిళా నాయకులు కవిత, కుమారి, మేరీ, రాధ, భ్రమరాంబిక, కృష్ణవేణి, విజయ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు తమ మద్దతు ప్రకటించారు..