ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి ..
మల్కాజిగిరి ప్రజావాణిలో జెడ్సీకి...కాలనీ వాసుల ఫిర్యాదు
మల్కాజిగిరి, మేజర్ న్యూస్: మౌలాలి రైల్వే క్వార్టర్స్ సమీపంలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో ఇటీవల వాహన ప్రమాదాలు అధికమవు తున్నాయని, నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. ప్రశాం త్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాదాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నోరి సత్య మూర్తి తదితరులు సోమవారం మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ కాలనీలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని ఆందో ళన వెలిబుచ్చారు. ముఖ్యంగా ద్విచక్ర వాహ న దారులు అధిక వేగంతో నడిపిస్తున్నారని, దీనివల్ల చౌరస్తాలలో ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీ కొని అనేక మంది గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.
ఇటీవల ఒకరు కోమాలోకి వెళ్ళే పరిస్థితి కూడా వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ కి వెళ్లే పిల్లలు, సీనియర్ సిటిజన్స్ రోడ్డు మీదికి రావడానికి భయపడుతున్నా రని, ఈ ప్రమాదాలను నివారించడానికి రబ్బ ర్ తో తయారు చేసిన రంబుల్ స్టిప్స్ ఏర్పా టు చేయాలని కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సంఘం ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రత్న భూషణ్, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు