రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని అని ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ రవిశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ లోని రాంలీలా మైదానం లో రాహుల్ గాంధీ నాయకత్వం లో జరిగిన ప్రజల హక్కుల కోసం, ప్రజాసామ్య పరిరక్షణకై మోడీ ప్రభుత్వం పై చేసిన పోరాటం దేశ ప్రజలందరూ ముక్త కంఠముతో హర్షం వ్యక్తం చేస్తున్నారని డాక్టర్ పి.వీ.రవి శేఖర్ రెడ్డి అన్నారు .
నవంబర్ 1 ఆదివారం ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ రాంలీలా మైదానంలో “ఓట్ బచావో - దేశ్ బచావో “భారీ నిరసన కార్యక్రమానికి డాక్టర్ రవి శేఖర్ రెడ్డి హాజరై సోమవారం అక్బర్ రోడ్ లోని కేకేసీ కార్యాలయంలో మాట్లాడుతూ రాంలీలా మైదానం లో జరిగిన నిరసన కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజల తరలి వచ్చారని అన్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో దేశ ప్రజలందరూ ప్రధాని మోడీ చేసిన అక్రమాలపై తిరుగుబాటు చేసి 2029 లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ఖాయమన్నాకు. భావి భారత ప్రధానిగా దేశ ప్రజల కోసం త్యాగాలకు వెనుదీయని కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చెయ్యడం కళ్లారా చూస్తారని సందర్భంగా డాక్టర్ రవి శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.