ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ*
కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ శ్రీ చిత్తరమ్మ గాజులరామారం శాఖ ఆధ్వర్యంలో గాజులరామారంలోని ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రోగ్రాం కమిటీ చైర్మన్ దేవరశెట్టి జగదీశ్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అధ్యక్షులు సిద్ధా సూర్య ప్రకాష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సరస్వతీ మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, చదువుకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు వాస శ్రీనివాస్, సోమిశెట్టి పవన్ గుప్తా, గాంధీ, ఆకుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.