కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: చిత్తూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సతీమణి కంచెర్ల ప్రతిమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం చిత్తూరు రూరల్ మండలంలోని తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యం గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు.
జడ్పీటీసీ అభ్యర్థి మంజుల, ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు,స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులు నవనీత, లావణ్య, సీనియర్ నాయకుడు చంద్రప్రకాష్‌తో కలిసి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ప్రతిమ మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి , జడ్పీటీసీ , ఎంపీపీ,
ఎంపీటీసీ,అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఆమె కోరారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్