BREAKING
ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు

ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు

Select Suryaa Now
ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు

*ఏలూరు జిల్లాలో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు*

 

         ఏలూరు, మేజర్ న్యూస్:  ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు ఈనెల 1వ తేదీన పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈనెల 3వ తేదీ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.  

           ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏలూరులోని సర్. సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో, నూజివీడు పురపాలక సంఘానికి సంబంధించి నూజివీడులో సారధి ఇంజనీరింగ్ కళాశాలలో, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద  నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది ఉదయం 6 గంటలకే సంబంధిత   కేంద్రాలకు  చేరుకుని విధుల్లో పాల్గొంటారు.  ముందుగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తీసుకువచ్చి, ఎన్నికల నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి సర్. సి.ఆర్. రెడ్డి  ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన  ఓట్ల లెక్కింపు కేంద్రంలో  కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా నిర్వహించేందుకు  రెండు కౌంటింగ్ హాల్స్ ను ఏర్పాటుచేశారు.  డివిజన్ కార్పొరేటర్లకు, మేయర్ ఓట్లను వేరువేరుగా లెక్కిస్తారు.  

             సోమవారం సాయంత్రం సర్.సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతీ టేబుల్ పై కౌంటింగ్ నకు అవసరమైన పరికరాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు.  కౌంటింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేందుకు మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని  అధికారులను ఆదేశించారు.  ఫలితాలను తెలియజేసే డిస్ప్లే బోర్డులను పరిశీలించారు.  భారీ వర్షాలు కురుస్తాయన్న  వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు.  పోలింగ్ సిబ్బందికి అవసరమైన స్నాక్స్ అందించేలా చూడాలన్నారు.  సిబ్బందికి ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. 

         కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, నగరపాలక సంస్థ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.