BREAKING
మద్దికుంటలో 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలి ..:వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మహీంద్రా అస్వితలో సదస్సు బ్రహ్మకుమారిస్ దీపాలి స్నేహ సమ్మేళనం విజయవంతం. ఏఐపీఎస్ఓ రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక జీహెచ్‌ఎంసీ క్రీడా పోటీలు–2026 ప్రారంభం సిబిఎస్ఇ జాతీయ జిమ్నాస్టిక్ ఛాంపియన్‌షిప్ 2026 ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ*

ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం...

Select Suryaa Now
ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం...

బసవేశ్వర ఆలయ నిర్మాణానికి యాజమాన్యం అంగీకారం…

ఫరూక్ నగర్ రంగారెడ్డి 

 మండలం మెల్లగూడ తండా గిరిజనుల న్యాయపోరాటం ఫలించింది. వందేళ్లుగా తమ పూర్వీకులు బసవేశ్వరుడిగా పూజిస్తున్న రాతిబండను తొలగించేందుకు ట్రై సిటీ వెంచర్ యాజమాన్యం చేసిన ప్రయత్నాలను గిరిజనులు ఐక్యంగా అడ్డుకున్నారు.

తండా పరిధిలోని  ఉన్న పవిత్ర బసవేశ్వర బండను తొలగించేందుకు యాజమాన్యం యత్నించడంతో గ్రామ ఉప సర్పంచ్ వేణ nనాయక  ఆధ్వర్యంలో గిరిజనులు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు.

చర్చలు సానుకూలంగా ముగిశాయి. గిరిజనులు పూజిస్తున్న చోటే బసవేశ్వర ఆలయాన్ని నిర్మించి ఇచ్చేందుకు ట్రై సిటీ యాజమాన్యం అంగీకరించింది. అదేవిధంగా మరో వెంచర్‌లో హనుమాన్ ఆలయ నిర్మాణానికి కూడా అంగీకారం తెలిపింది.

దీంతో తమ పూర్వీకుల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. తమ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.

నరసింహ రెడ్డి మేజర్ న్యూస్…