కూటమికి ఓటేయండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి: మంత్రి కందుల దుర్గేష్
పెరవలి మేజర్ న్యూస్ :తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలో నవంబర్ 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.నవంబర్ 2వ తేదీ సోమవారం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ కూటమి అభ్యర్థుల తరఫున భారీ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా పెరవలి మండల జెడ్పీటీసీ కూటమి అభ్యర్థి అతికాల వెంకట రామకృష్ణమ్మ (శ్రీను)తో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.రోడ్ షోకు ముందు పిట్టలవేమవరంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి 'జై భీమ్' అంటూ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేయలేని అనేక అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేసి చూపించిందన్నారు. పెరవలి మండలంలోనే రూ.61.77 కోట్ల వ్యయంతో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలు చేస్తున్న పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0, శాస్కీ పథకాల ద్వారా గ్రామీణ రహదారుల రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను స్థానిక సంస్థల ద్వారా క్షేత్రస్థాయిలోని ప్రతి పేదవాడికి చేరవేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ నేపథ్యంలో నవంబర్ 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.