గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు .
ఆలమూరు మేజర్ న్యూస్ :జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోరులో ఆలమూరు మండల ఎన్డీఏ కూటమి జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు గెలుపు దిశగా నల్లేరు మీద నడక అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఎన్డీఏ కార్యకర్తలు భారీ అంచనాలతో ఉన్నారు.అధికారంలోనైనా అనాధికారంలోనయినా ఆలమూరు మండలంలో బండారు సత్యానందరావు బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ విజయం సాధించడంతో అభ్యర్థుల గెలుపు పై డోకా లేదు అన్న భావన ఆలమూరు మండలంలో నెలకొని ఉంది.
దానికి తోడు ఈసారి జరుగుతున్న ఎన్నికల సమరంలో బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా ఉండటం జనసేన పార్టీ ఇంచర్జ్ బండారు శ్రీనివాసు అన్న దమ్ముల కలియకతో మండలంలో జన సేన పార్టీపై లంక గ్రామాల్లో ఎక్కువగా పట్టు ఉండడంతో జడ్పిటిసి తోపాటు ఎంపీటీసీలు గెలుపు సునాయాసముగా ఉంటుందని కూటమి నాయకులు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
.సంక్షేమంతో పాటు వందల కోట్లలో అభివృద్ధి పనులు జరగడంతో కూటమి ప్రభుత్వం పై ప్రజలు సానుకూల భావం చూపిస్తున్నారు. మండలంలోని ఎంపీటీసీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో కైవసం చేసుకునే మండల ప్రెసిడెంట్ పూర్తి అనుకూల పవనాలు ఉండడంతో అభ్యర్థుల విజయంపై అంచనాలు భారీగా పెరిగాయి. జడ్పిటిసి అభ్యర్థి సుబ్బరాజు చిన్న వయసునుండి అందరితో కలిసి మెలసి వివాద రహితుడుగా మడికి అంతర్జాతీయ కూరగాయల మార్కెట్ చైర్మన్గా రాజకీయంగా అనుభవం సుబ్బరాజుకు కలిసి వచ్చే అంశం.