పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం.
అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి – గ్రామ శాఖ అధ్యక్షులు ద్వారంపూడి ఈశ్వర్ రెడ్డి.
అనపర్తి, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు ద్వారంపూడి ఈశ్వర్ రెడ్డి ఎంపీటీసీ అభ్యర్థి గుడాల దుర్గతో కలిసి గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటు వేసి మద్దతు తెలపాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ద్వారంపూడి ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అనపర్తి మండలంలో ఇప్పటికే పలు అభివృద్ధి పరుగులు తీస్తుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఓటర్లను కోరారు.
గ్రామంలోని ప్రతి ఓటరును నేరుగా కలిసి కూటమి అభ్యర్థుల ఎన్నికల గుర్తులకు ఓటు వేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ రెడ్డి, కూటమి నాయకులు కర్రీ జియ్యన్న రెడ్డి, ద్వారంపూడి చిన్న ఈశ్వర్ రెడ్డి, ద్వారంపూడి ప్రభాకర్ రెడ్డి, మండ అన్నవరం, సత్తి వెంకన్నబాబు, దాసరి జమ్మి, నీలం నాగేశ్వరరావు, కాశీ విశ్వనాథరెడ్డి, గోపి, సత్తిబాబు, దుర్గా రెడ్డి, ద్వారంపూడి మణి, వనం మల్లేశ్వరి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.