కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్
పెరవలి మేజర్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మీ మార్ట్ కార్యక్రమం పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది.నవంబర్ 1వ తేదీ ఆదివారం పెరవలి తహసీల్దార్ కే. నిరంజన్ ఈ మీ మార్ట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కే. నిరంజన్ మేజర్ న్యూస్‌తో మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారికి అండగా నిలవడంతో పాటు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.ప్రజలు మీ మార్ట్ సేవలను సద్వినియోగం చేసుకొని నిత్యావసర వస్తువులను అందుబాటు ధరలకు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.