BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.

 అనపర్తి, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి మండల జెడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేశ్వర స్వామి (భీమేష్)కు మద్దతుగా ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్లమిల్లి కాంతమ్మ, యువ నాయకులు నల్లమిల్లి రంజిత్ కుమార్, మేడపాటి బుల్లిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాసరెడ్డి, పొలమూరు మాజీ ఉపసర్పంచ్ సత్తి సురారెడ్డి, రంజిత్ యూత్ సభ్యులు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.