ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన
పెరవలి మేజర్ న్యూస్ ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు నవంబర్ 1వ తేదీ ఆదివారం కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది.ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను, నేలకొరిగిన అరటి తోటలను, ధ్వంసమైన ఇళ్లను, ఇతర ఆస్తి నష్టాలను బృంద సభ్యులు పరిశీలించారు. ముఖ్యంగా తుఫాన్ గాలులు, వర్షాల ప్రభావంతో నేలవాలిన వరి పంటలను, దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేశారు.
అలాగే తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. వివిధ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా నష్టం అంచనా నివేదికలను రూపొందించారు.ఈ పర్యటనలో కేంద్ర బృందం వెంట కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనందరావు, పెరవలి తహసీల్దార్ కె. నిరంజన్, ఇతర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలనతో తుఫాన్ బాధిత రైతులు, ప్రజలకు జరిగిన నష్టంపై సమగ్ర వివరాలు సేకరించారు. నష్ట అంచనా నివేదికల ఆధారంగా బాధితులకు ప్రభుత్వ పరంగా సహాయం అందుతుందని రైతులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.