BREAKING
సూపర్ మార్కెట్ ఫ్రీజర్లనే హ్యాక్ చేస్తే ఇతర టెక్నాలజీ ఎంతవరకు సురక్షితం?: నిపుణుల హెచ్చరికలు ఐర్లాండ్ పురాణాల ‘నరక ద్వారం’: చారిత్రక గుహ వైపు సరికొత్త నడక మార్గం ఆస్ట్రేలియా సోషల్ మీడియా నిషేధంపై హైకోర్టులో న్యాయ పోరాటం: రాజ్యాంగబద్ధతను సవాలు చేసిన రెడ్డిట్, డిజిటల్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ లిండ్సే క్లాన్సీ కేసులో రీట్రయల్ దిశగా ప్రాసిక్యూటర్ల అడుగులు: ముగ్గురు పిల్లల హత్య కేసులో తాజా పరిణామాలు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్న భారతీయ-అమెరికన్ ఓటర్లు: తాజా సర్వేలో కీలక విషయాలు వెల్లడి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వియత్నాం పర్యటన: రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు ఉక్రెయిన్ సహాయక కేంద్రంపై రష్యా భీకర బాంబు దాడి: 24 మంది మృతి, జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహం ఉక్రెయిన్ ఎయిర్ అలర్ట్ యాప్ హ్యాక్: అణు దాడి అంటూ నకిలీ హెచ్చరికలు, భయాందోళనలు రేపినా తప్పిన గందరగోళం డిక్సన్ టెక్, దీపక్ నైట్రైట్ క్యూ2 ఫలితాలు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సవరించిన టార్గెట్ ప్రైస్, వృద్ధి అంచనాలు మోతీలాల్ ఓస్వాల్ క్యూ2 మధ్యంతర సమీక్ష: 12 త్రైమాసికాల్లోనే అత్యధిక లాభాల వృద్ధి, బీఎఫ్ఎస్ఐ మరియు లోహ రంగాల జోరు అజంతా ఫార్మా క్యూ2 రివ్యూ: అద్భుత పనితీరు కనబరిచినా ర్యాలీతో పరిమితమైన లాభాల పరిధి ముత్తూట్ ఫైనాన్స్ క్యూ2 రివ్యూ: లాభాలు పటిష్టంగా ఉన్నా నిర్మల్ బాంగ్ ఆచితూచి అడుగులు ఎఫ్‌పీఐల నిష్క్రమణ: పన్ను తగ్గింపు డిమాండ్ల పరిశీలనకు ఎఫ్‌ఎం సై స్టాక్ మార్కెట్ టుడే: నవంబర్ 3 ట్రేడింగ్‌కు ముందు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం జోరు: గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్ల జంప్, భారీ గ్యాప్-అప్ సంకేతాలు

చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం.

Select Suryaa Now
 చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం.

                                  ప్రజా సమస్యలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అజెండా – చిర్ల జగ్గిరెడ్డి
ఆలమూరు మేజర్ న్యూస్డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి  ఈరోజు ఆలమూరు మండలంలోని చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద నుండి స్థానిక ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు.  ప్రజా సమస్యలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రసార అజెండా అని తెలిపారు .మండల జడ్పీటీసీ అభ్యర్థిగా  తమ్మన శ్రీనివాసు మండలంలోని వైయస్సార్ పార్టీ ఎంపీటీసీ   అభ్యర్థులుగా పోటీ చేయుచున్న వారికి ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు 

.పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, రోజువారీ కూలీ చేసుకునే కార్మికులు, చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు కుటుంబ ఖర్చులను నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వంట నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో నెలవారీ కుటుంబ బడ్జెట్ తారుమారవుతోందని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలు, మహిళలకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు సంబంధించిన భరోసా వంటి అంశాలపై ప్రజల్లో నెలకొన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. 
రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలు, ఎరువుల కొరత, వ్యవసాయ పెట్టుబడుల భారం, పంటలకు గిట్టుబాటు ధర వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు గ్రామాల అభివృద్ధికి కీలకమని, ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని ఎన్నుకునే విషయంలో ప్రతి ఒక్కరూ అభ్యర్థుల పనితీరు, ప్రజలతో వారి అనుబంధం, గ్రామాభివృద్ధిపై వారి ప్రణాళికలను పరిశీలించాలని ఈ సందర్భంగా వివరించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తుందని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి  తమ్మన శ్రీనివాసు ఆయా గ్రామాల వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.