పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు
పెరవలి మేజర్ న్యూస్ :పెరవలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్ బూరుగుపల్లి శేషారావు నవంబర్ 1వ తేదీ ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.మొదట అజ్జరం, వెంకట్రాయపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెరవలి మండల జడ్పీటీసీ కూటమి అభ్యర్థి అతికాల వెంకట రామకృష్ణమ్మ (శ్రీను), అజ్జరం, వెంకట్రాయపురం గ్రామాల ఎంపీటీసీ కూటమి అభ్యర్థి గంటి శ్రీనుతో కలిసి బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు.జడ్పీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఒక ఓటు, ఎంపీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై మరొక ఓటు వేసి ఇద్దరు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ, మండల స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం కాకరపర్రు గ్రామంలో నిర్వహించిన కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో బూరుగుపల్లి శేషారావు పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.తదుపరి పెరవలి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జడ్పీటీసీ కూటమి అభ్యర్థి అతికాల వెంకట రామకృష్ణమ్మ (శ్రీను), పెరవలి గ్రామ ఎంపీటీసీ కూటమి అభ్యర్థి కుక్కల వెంకట సాయికుమార్‌తో కలిసి బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.జడ్పీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఒక ఓటు, ఎంపీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై మరొక ఓటు వేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.నాలుగు గ్రామాల్లో జరిగిన ఈ ప్రచార కార్యక్రమాల్లో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.