ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్
ఆత్రేయపురం మేజర్ న్యూస్ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేస్తాయని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ అన్నారు
ఆదివారం జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్, ఎంపీటీసీ అభ్యర్థుల వైయస్సార్సీపి మండల కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజుతో కలిసి మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు
ఈ సందర్భంగా పాటి శివకుమార్ మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రైతులకు, మహిళలకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజలకు ఉన్న అభిమానం, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆశీస్సులు, పార్టీ శ్రేణుల కృషితో ఆత్రేయపురం మండలంలో కప్పల శ్రీధర్ తో పాటు ఎంపీటీసీ సభ్యులు భారీగా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ర్యాలీ, ఆత్రేయపురం, మెర్లపాలెం, బుల్లిరేవు తదితర గ్రామాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.