BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

Select Suryaa Now
ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లాలో నవంబర్ 1వ తేదీన మదనపల్లి,పుంగనూరు పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు.పోలింగ్ సజావుగా,ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పోలీసు శాఖ సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.నవంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలు,ఒత్తిళ్లకు గురికాకుండా స్వేచ్ఛగా,నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఎన్నికలు ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు,పోటీలో ఉన్న అభ్యర్థులు,రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు.ప్రతి ఓటరు బాధ్యతగా స్పందించి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కోరారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి