BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

తొలి ఆరేళ్లే పిల్లల భవిష్యత్తుకు పునాది మెదడు అభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

Select Suryaa Now
తొలి ఆరేళ్లే పిల్లల భవిష్యత్తుకు పునాది  మెదడు అభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి

                                        ఖరీదైన బొమ్మల కంటే ప్రేమ, మాటలు, ఆటలే ముఖ్యం: రాధిక ఎన్. ఆచార్య

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : పిల్లల మెదడు అభివృద్ధిలో తొలి ఆరేళ్లు అత్యంత కీలకమని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్, చైల్డ్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ రాధిక ఎన్. ఆచార్య తెలిపారు. ఐదేళ్ల వయస్సుకే మెదడు వయోజనుల మెదడు పరిమాణంలో 90 శాతానికి చేరుకుంటుందని, ఈ దశలో ప్రతి సెకనుకు పది లక్షలకు పైగా నాడీ సంబంధాలు ఏర్పడతాయని వివరించారు.
పుట్టినప్పటి నుంచి మూడేళ్ల వరకు భాష, ఇంద్రియ జ్ఞానం, భావోద్వేగ అనుబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, మూడు నుంచి ఆరేళ్ల మధ్య జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యల పరిష్కార సామర్థ్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పిల్లల ఎదుగుదలకు ఖరీదైన బొమ్మల కంటే తల్లిదండ్రుల ప్రేమ, సమయం, శ్రద్ధ ఎంతో అవసరమన్నారు. పిల్లలతో మాట్లాడటం, కథలు చెప్పడం, పుస్తకాలు చదివించడం, కలిసి ఆటలు ఆడటం వంటి అలవాట్లు మెదడు అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. స్క్రీన్ వినియోగాన్ని తగ్గించి సృజనాత్మక ఆటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రేమ, భద్రత, ప్రోత్సాహం లభించే కుటుంబ వాతావరణం పిల్లల మానసిక, భావోద్వేగ ఎదుగుదలకు బలమైన పునాది వేస్తుందని రాధిక ఆచార్య పేర్కొన్నారు.