BREAKING
కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య మహిళల్లో ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు .శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ దాసోజు శ్రవణ్ పై చంద్రాయన్ గుట్ట పిఎస్ లో బోయ నగేష్ పిర్యాదు అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు: రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఈ 4 సర్క్యూట్ సదస్సుకు ది ప్రీమియా అకాడమీ ఆతిథ్యం విద్యార్థులతో ప్రపంచ సవాళ్ల పరిష్కారాలకు యత్నం ప్రశాంత వాతావరణంలో జరగాలి బాధ్యతయుతంగా పని చేయాలి.. మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఎందుకు వస్తుంది? హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేడు ఏఐపీఎస్‌ఓ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభ ఎన్టీఆర్ నగర్‌లోని టీఎన్‌జీఓఎస్ ఉద్యోగుల ఫోరం భవనంలో నిర్వహణ

పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్

Select Suryaa Now
పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్

పటాన్‌చెరు;బస్సులో ప్రయాణిస్తున్న వ్యాపారి నగదు బ్యాగును చోరీ చేసిన నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు, సిసిఎస్ బృందం సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.9.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కేసును ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన వ్యాపారి ఎం. వెంకట రమణ అక్టోబర్ 28న కర్ణాటకలోని గుల్బర్గా నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. గుల్బర్గాలోని ఎస్‌బీఐ బ్యాంకు నుంచి డ్రా చేసిన రూ.10 లక్షల నగదును బ్యాగులో పెట్టుకుని ప్రయాణిస్తుండగా, లింగంపల్లి వద్దకు చేరుకునేసరికి బ్యాగు కనిపించకుండా పోయింది. దీంతో బాధితుడు అక్టోబర్ 29న రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోళి తాలూకా రాంశెట్టి నాయక్ తండాకు చెందిన పి. ఉమేష్ చవాన్ (27) ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.9.50 లక్షల నగదుతో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించి భారీ మొత్తంలో నగదును రికవరీ చేసిన రామచంద్రాపురం, సిసిఎస్ పోలీసు బృందాలను ఎసిపి శ్రీనివాస్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించే ప్రజలు నగదు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.