BREAKING
ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి?

ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చొరవతో ముగ్గురు నిరుపేదలకు ఎల్వోసీ మంజూరు

Select Suryaa Now
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చొరవతో ముగ్గురు నిరుపేదలకు ఎల్వోసీ మంజూరు

కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ :అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఎల్వోసీ  ద్వారా వైద్య సహాయం అందుతోంది. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చొరవతో మంజూరైన ఎల్వోసీ పత్రాలను శనివారం చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అర్హులైన వారికి ఎల్వోసీ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెరుగైన వైద్యం అవసరమైన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్వోసీ మంజూరైన వారిలో 127వ రంగారెడ్డి నగర్ డివిజన్ గిరి నగర్‌కు చెందిన ఆఫ్రిన్ బేగంకు రూ.1.10 లక్షలు, 129వ సూరారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన రాగి పుష్పవతికి రూ.3.50 లక్షలు, కొంపల్లి సర్కిల్ దూలపల్లికి చెందిన షరీఫా బీ సయ్యద్ కు రూ.1 లక్ష ఎల్వోసీ మంజూరైంది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఎర్వ శంకరయ్య, ప్రధాన కార్యదర్శులు సిద్ధిక్, సుధాకర్, సీనియర్ నాయకులు క్రాంతి యాదవ్, ఓంకార్ రెడ్డి, లక్ష్మణ్, నాగార్జున, చందు యాదవ్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.