BREAKING
ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి?

గేటెడ్ కమ్యూనిటీల్లో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: శంభీపూర్ కృష్ణవేణి

Select Suryaa Now
గేటెడ్ కమ్యూనిటీల్లో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: శంభీపూర్ కృష్ణవేణి

                                   మల్లంపేట్ ప్రణీత్ ప్రణవ్ లీఫ్ కాలనీలో ఓటరు నమోదు అవగాహన కార్యక్రమం

దుండిగల్ మేజర్ న్యూస్ :పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని దుండిగల్ పురపాలక తొలి చైర్‌పర్సన్ శంభీపూర్ కృష్ణవేణి కృష్ణ సూచించారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్ డివిజన్ మల్లంపేట్ ప్రణీత్ ప్రణవ్ లీఫ్ కాలనీలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంభీపూర్ కృష్ణవేణి కృష్ణ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కాలనీ సభ్యులు, పార్టీ నాయకులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. దుండిగల్ సర్కిల్ పరిధిలోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారంతా ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కు పొందేలా కాలనీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, బెంబడి బుచ్చిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్, బీఆర్ఎస్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి కొల్తూర్ మల్లేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, కాలనీ అధ్యక్షుడు అశోక్ గౌడ్, కాలనీ సభ్యులు కృష్ణ, గజేందర్ రెడ్డి, వర్మ, సబితా రెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.