BREAKING
ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు - అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ఆరేళ్లే పిల్లల భవిష్యత్తుకు పునాది మెదడు అభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి అంబర్ పేట్ కొత్త సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతల స్వీకరణ కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య మహిళల్లో ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు .శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ దాసోజు శ్రవణ్ పై చంద్రాయన్ గుట్ట పిఎస్ లో బోయ నగేష్ పిర్యాదు అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు: రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఈ 4 సర్క్యూట్ సదస్సుకు ది ప్రీమియా అకాడమీ ఆతిథ్యం విద్యార్థులతో ప్రపంచ సవాళ్ల పరిష్కారాలకు యత్నం ప్రశాంత వాతావరణంలో జరగాలి

-పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం

Select Suryaa Now
-పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం

పటాన్‌చెరు;ప్రజల రక్షణే పరమావధిగా భావించి శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేసిన ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావు సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించి పదవీ విరమణ పొందడం సంతోషకరమని పేర్కొన్నారు. శనివారం ఇస్నాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం కేవలం వృత్తి మాత్రమే కాదని, అది సమాజం పట్ల బాధ్యత, కర్తవ్యం, అంకితభావానికి ప్రతీక అని అన్నారు. ఎండనక, వాననక, పండుగలు, సెలవులు లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తారని తెలిపారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో, న్యాయానికి నిబద్ధులై నాగేశ్వరరావు ప్రజలకు సేవలందించారని కొనియాడారు. తన అనుభవంతో సహచరులకు మార్గదర్శకంగా నిలిచి పోలీసు శాఖ గౌరవాన్ని పెంచారని పేర్కొన్నారు.ఒక అధికారి పదవీ విరమణ పొందవచ్చని, కానీ ఆయన అందించిన సేవలు, చేసిన మంచి పనులు, సంపాదించుకున్న గౌరవం ఎప్పటికీ పదవీ విరమణ పొందవని ఎస్పీ అన్నారు. పదవీ విరమణ అనంతరం నాగేశ్వరరావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.