బ్రహ్మాసముద్రం లో వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం జోరు.
బ్రహ్మసముద్రం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బ్రహ్మసముద్రం మండలంలోని పాలవెంకటాపురం పంచాయతీ మాముడూరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో కోరారు. ఈ సందర్భంగా బ్రహ్మసముద్రం మండల జడ్పీటీసీ అభ్యర్థి పాలబండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి బి.లతమ్మ మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపిస్తే బ్రహ్మసముద్రం మండలాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పాటు కళ్యాణదుర్గం మాజీ ఎంపీ, మాజీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ప్రోత్సాహంతో ఎన్నికల బరిలో ముందుకు సాగుతున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. మాముడూరులో నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ప్రచార సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జిల్లా, తాలూకా, మండల, గ్రామస్థాయి నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.