BREAKING
శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సైబర్ నేరాలపై చందానగర్ పోలీసుల అవగాహన నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్*

రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు

Select Suryaa Now
రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, మరో తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటికి తుపానుగా బలపడే అవకాశాలున్నాయని, నవంబర్ 2, 3, 4 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సోసైటీ నుంచి రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, అర్నబ్ తుపాను విధ్వంసం అనంతరం చేపడుతున్న పునరుద్ధరణ పనులపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రసుత్తం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గమనాన్ని ఉపగ్రహ చిత్రాలు, డాప్లర్ రాడార్ల ద్వారా ప్రతి ఆరు గంటలకు ఓసారి అంచనా వేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమర్ధ నీటి నిర్వహణ ద్వారా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను కూడా గుర్తించి తగిన ప్రణాళిక చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. *

మొబైల్ నెట్వర్క్‌కు అంతరాయం లేకుండా ప్రణాళిక* విద్యుత్ అంతరాయం ఏర్పడినా మొబైల్ నెట్‌వర్క్ పనిచేసేలా అన్ని మండల కేంద్రాల్లో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని బీఎస్ఎన్ఎల్ 4,500 టవర్లతో పాటు ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు నిరంతర విద్యుత్ అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ అవకాశాలను కూడా పరిశీలించాలని చెప్పారు. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 7 వేల మంది సిబ్బంది, 400 యంత్రాలతో విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. వీటిని వేగంగా పూర్తి చేసి అన్ని గృహాలకు విద్యుత్ సరఫరా అందించాలని సీఎం ఆదేశించారు. తుఫాను సమయంలో దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. కాకినాడ వద్ద ప్రొటెక్షన్ వాల్‌ను పునరుద్ధరించాలన్నారు. 

నరసాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో కాలువల పూడిక తొలగించాలని సూచించారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నీరు దిగువ ప్రాంతాలకు సజావుగా వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. భవిష్యత్తులో రోడ్లు, కాలువలు ముంపునకు గురికాకుండా ప్రత్యేక ఎస్ఓపీ రూపొందించాలని ఆదేశించారు. *ప్రతి రైతుకూ పంటల బీమా భరోసా* ప్రకృతి విపత్తుల నుంచి రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమాపై విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. వచ్చే సీజన్ నుంచి ప్రతి రైతు బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 47 లక్షల మంది రైతులకు చేరువయ్యేందుకు యాప్‌ను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయంపై చైతన్యం కల్పించాలని చెప్పారు.

 సాంకేతికతను వినియోగిస్తున్న చాంపియన్ రైతులను గుర్తించాలని సూచించారు. అర్నబ్ తుపాను వల్ల కొబ్బరి, అరటి పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. కొబ్బరి పంట దెబ్బతిన్న 1,293 హెక్టార్లకు హెక్టారుకు రూ.54 వేల చొప్పున, నేల కొరిగిన, తలలు దెబ్బతిన్న ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.1,500 చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు. సుమారు 1.95 లక్షల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నట్లు అధికారులు వివరించారు. అలాగే 15 వేల హెక్టార్లలో దెబ్బతిన్న అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విద్యుత్, విపత్తుల నిర్వహణ శాఖల ఉన్నతాధికారులు, వివిధ టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.