శిల్పారామంలో అలరించిన భరతనాట్య ప్రదర్శన
కొండాపూర్,మేజర్ న్యూస్ : మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం కుమారి పూజిత బంధువుల శిష్య బృందం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో పుష్పాంజలి, నర్తనం, శ్లోకాలు, జతిస్వరం, నటేశ కౌతం, రంగపూజ, శబ్దం, శ్యామలే మీనాక్షి, పంచమూర్తి కౌతం, వలజి తిల్లాన, భో శంభో, మంగళం వంటి సాంప్రదాయ నృత్య అంశాలు కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు.విహంగా, వైష్ణవి, తనస్వి, భవిష్య, నిహిత, రుద్రాక్ష, దితి, కృతి, శరణ్య, శ్రీనిక తదితర కళాకారులు తమ చక్కటి నృత్యాభినయం, లయబద్ధమైన అడుగులు, హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయమైన భరతనాట్య వైభవాన్ని చాటిచెప్పిన ఈ ప్రదర్శన ఆద్యంతం అలరించింది. కళాకారుల ప్రతిభను ప్రేక్షకులు అభినందించారు.