BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

విద్యుత్ సరఫరా రెండు రోజుల్లో పూర్తిగా పునరుద్ధరిస్తాం -- తుఫాన్ బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ నాగరాణి

Select Suryaa Now
విద్యుత్ సరఫరా రెండు రోజుల్లో పూర్తిగా పునరుద్ధరిస్తాం  -- తుఫాన్ బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ నాగరాణి

యలమంచిలి, మేజర్ న్యూస్ :ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం యలమంచిలి మండలంలో పర్యటించి పరామర్శించారు. 

ఈ సందర్భంగా ఆర్యపేట, దొడ్డిపట్ల గ్రామాల్లో పర్యటించి తుఫాన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్యపేట గ్రామానికి చెందిన దొంగ శ్రీనివాస్ ఇంటిపై సుమారు 100 సంవత్సరాలకు పైబడిన భారీ రావి చెట్టు తుఫాన్ ప్రభావంతో కూలిపోవడంతో చెట్టు కొమ్మలు, దుంగలను తొలగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ ఆదేశాలతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహాయంతో చెట్టు కొమ్మలు, దుంగలను తొలగించడం జరిగింది.

అనంతరం గ్రామాల్లో మహిళలతో మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు.

మరో రెండు రోజుల్లో జిల్లాలో విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి తీసుకువస్తామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ భరోసా ఇచ్చారు. తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.