పలమనేరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు ఆదివారం జరగనున్న సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.మున్సిపాలిటీ పరిధిలోని 29 ప్రాంతాల్లో 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 432 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించారు. ఓటర్లకు తాగునీరు, నీడ, ర్యాంపులు తదితర సౌకర్యాలు సిద్ధం చేశారు.ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్ స్లిప్పులు అందని వారు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలను సంప్రదించి పొందవచ్చని తెలిపారు. నవంబర్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్