విద్యార్థులకు సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్ ల పై అవగాహన
ఏలూరు,మేజర్ న్యూస్ : జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు మేరకు, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళా ఎస్ఐ నాగమణి , శక్తి టీమ్ సభ్యులు ఆర్.ఆర్ పేట లోని శ్రీ విద్యాలయ జూనియర్ కాలేజీ లో విద్యార్థిని విద్యార్థులకు ఒక ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు.
మ సైబర్ క్రైమ్ , హెల్ప్‌లైన్ 1930
ఆన్‌లైన్ మోసాలు, గేమింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా వేధింపులు లేదా సైబర్ నేరాల బారిన పడితే భయపడ కుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు వివరించారు. అలాగే ఎవరికీ కూడా వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు చెప్పకూడదని హెచ్చరించారు.అత్యవసర సహాయం డయల్ 112 ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, తక్షణ సహాయం పొందడానికి 112 నెంబర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, దీనిని ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 విద్యార్థులు, పిల్లలు ఎవరైనా మానసిక, శారీరక వేధింపులకు గురైనా, లేదా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నా బాలల సహాయార్థం పనిచేసే 1098 నెంబర్ ను సంప్రదించి రక్షణ పొందవచ్చని తెలిపారు.శక్తి టీమ్స్, భద్రతా అవగాహన
మహిళలు , బాలికల రక్షణ కోసం ఏలూరు జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'శక్తి టీమ్స్' పనితీరును వివరించారు.ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే లేదా వేధింపులు ఎదురైతే తక్షణమే ధైర్యంగా స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.