గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా స్పష్టం - జడ్పిటిసి అభ్యర్థిని షేక్ నాజియాకి మద్ధతుగా ప్రచారం
పీలేరు,మేజర్ న్యూస్ : పీలేరు మండలం జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ నాజియాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు పాత బస్టాండు,కట్ట కాలువ వీధి,చిన్న,పెద్ద మసీదు వీధులు,బ్రాహ్మణ వీధితోపాటు పలు ప్రాంతాల్లో శనివారం పర్యటించి ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినికి మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకురాలిగా షేక్ నాజియాకు మద్ధతు తెలపాలని కోరారు.ప్రజల సమస్యలను తెలుసుకుని,వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు.ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం ద్వారా గ్రామాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు.పీలేరు నియోజక వర్గ ఇన్‌చార్జి సోమశేఖర్ రెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి,వారి అభివృద్ధికి కృషిచేసే అభ్యర్థికి ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని కోరారు.రైతులు,మహిళలు,యువతతోపాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసే నాయకత్వం అవసరమని అన్నారు.ప్రజల ఆశీస్సులతో షేక్ నాజియా ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి