BREAKING
అంబర్ పేట్ కొత్త సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతల స్వీకరణ కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య మహిళల్లో ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు .శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ దాసోజు శ్రవణ్ పై చంద్రాయన్ గుట్ట పిఎస్ లో బోయ నగేష్ పిర్యాదు అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు: రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఈ 4 సర్క్యూట్ సదస్సుకు ది ప్రీమియా అకాడమీ ఆతిథ్యం విద్యార్థులతో ప్రపంచ సవాళ్ల పరిష్కారాలకు యత్నం ప్రశాంత వాతావరణంలో జరగాలి బాధ్యతయుతంగా పని చేయాలి.. మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఎందుకు వస్తుంది? హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాల వద్ద  పటిష్ట భద్రతా చర్యలు

ఏలూరు, మేజర్ న్యూస్ :ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో1వ తేదీ ఆదివారం నిర్వహించ నున్న ఎన్నికల విధుల కోసం నియమితులైన సిబ్బందికి  జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్ ఏలూరులోని సి.ఆర్. రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పేపర్ పంపిణీ కేంద్రం వద్ద విధుల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తిస్థాయి అప్రమత్తతతో, క్రమశిక్షణతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.

 స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌తో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది పాటించాల్సిన విధివిధానాలు, చేయాల్సిన పనులు, నివారించాల్సిన చర్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ  తెలిపారు.

 పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల పరిధిలో రాజకీయ ప్రచారాలు, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, అనుమతి లేని గుంపులుగా చేరడం వంటి వాటికి అవకాశం లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అమలులో ఉన్న నిషేధాజ్ఞలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

 ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది భరోసా కల్పించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, సమస్యాత్మక పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించాలని, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. 

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ  దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్  ఏలూరు టౌన్ ఇన్స్పెక్టర్లు సి ఐ  లు, ఎస్సైలు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇన్చార్జి ఏలూరు,