మదనపల్లి వైకాపా జడ్పీటీసీ అభ్యర్థిని కిరణ్మయి ముమ్మర ప్రచారం : 27 ఎంపీటీసీ సెగ్మెంట్లను అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం - వైకాపా సమన్వయకర్త ఎస్.నిసార్ అహమ్మద్ పిలుపు
మదనపల్లి,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లె మండలంలోని 27 ఎంపిటీసి అభ్యర్థులు,జడ్పీటీసీ అభ్యర్థి జన్నె కిరణ్మయి గెలుపు కోసం నాయకులు,కార్యకర్తలు కలసి పని చేయాలని మదనపల్లె వైయస్సార్సిపి సమన్వయకర్త ఎస్.నిసార్ అహమ్మద్ పిలుపునిచ్చారు.శుక్రవారం సాయంత్రం మదనపల్లె మండలం పొన్నీటిపాళ్యం పంచాయతీ చిప్పిలిలో జడ్పీటీసీ అభ్యర్థి జెన్నె కిరణ్మయి,పొన్నుటిపాళ్యం-1 ఎంపిటీసి అభ్యర్థి రాజ్ కుమార్లకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేపట్టారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటానే జడ్పీటీసీ,ఎంపిటీసి ఎన్నికల ప్రచారానికి రావడంతో వైసీపీ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.స్థానిక నాయకులు దుశ్శాలువతో సన్మానించి,పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి,శేషాచలపతి నాయుడు,మల్‌రెడ్డి,పసుపు లేటి శశికుమార్,బయారెడ్డి,నర్సింహారెడ్డి,ఓబుల్ రెడ్డి,చలపతి,రమణ,దేవి,పల్లవి,శివారెడ్డి,మల్లికార్జున రెడ్డి తోకలిసి ఇంటింటికీ వెళ్ళి వైయస్సార్ సిపి అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు.కూటమి పాలనలో ధరల పెరుగుదల,ఇచ్చిన సూపర్ సిక్స్ హామిలు అమలు చేయకపోవడాన్ని ప్రజలకు వివరిస్తూ తన ప్రచారం సాగించారు.విద్యావంతులైన జడ్పీటీసీ జన్నె కిరణ్మయిని గెలిపిస్తే ప్రజా సమస్య పరిష్కారానికి తగిన చోరవ చూపిస్తారని హామీ ఇస్తున్నారు.ఈ సందర్భంగా ఎన్.నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ మదనపల్లె మండలానికి సంబంధించిన ఎంపీటీసీ సెగ్మెంట్లను వైయస్సార్సిపి నాయకులు,కార్యకర్తలు ఐకమత్యంతో అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్దానిక ప్రజలు,వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి