BREAKING
ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్: నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఐ యామ్ గేమ్ సినిమా ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా సౌభాగ్యం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.రెడ్డి సాహెబ్ : పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లాబకష్ గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి?

గిరిజన విద్యార్థులను అమరావతికి తరలించేందుకు చర్యలు!

Select Suryaa Now
గిరిజన విద్యార్థులను అమరావతికి తరలించేందుకు చర్యలు!


అరకులోయ,అక్టోబర్ 31, మేజర్ న్యూస్:రాజ్యాంగ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గిరిజన విద్యార్థినీ,విద్యార్థులను అమరావతికి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలలో నిర్వహించే పోటీ పరీక్షల్లో గెలుపొందే గిరిజన విద్యార్థినీ,విద్యార్థులను రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు.8,9,10వ తరగతులు చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులలో ముగ్గురు వంతున ఎంపిక చేసి వారికి పోటీ పరీక్షలు నిర్వహించి ఈ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారిని అమరావతికి తరలిస్తామని మండల గిరిజన సంక్షేమశాఖ సహాయ అధికారి కూడా. వెంకటరమణ,మండల విద్యాశాఖ అధికారి వంతల.త్రినాధరావు, రవ్వలగుడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,పోటీ పరీక్షల చైర్మన్ తెలగంజి. నాగేశ్వరరావు తెలిపారు. ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయడంపై వ్యాసరచన పోటీలు,శాసనాలు నిర్మాణంలో మన పాత్రపై ఎలకుషన్,భారత స్వాతంత్ర్య పోరాటం, జాతీయ ఉద్యమాలు, ఆధునిక భారతదేశ నిర్మాణంపై క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్టు వారు చెప్పారు.అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 31వ తేదీ శనివారం 40 మంది విద్యార్థినీ,విద్యార్థులకు మండల స్థాయి పోటీ పరీక్షలు (వ్యాసరచన, వకృత్వ,క్విజ్) నిర్వహించామన్నారు. నవంబర్ నెల 4వ తేదీ బుధవారం మండల స్థాయి పోటీ పరీక్షల్లో గెలిచిన ముగ్గురు విద్యార్థినీ, విద్యార్థులకు నియోజకవర్గస్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వారు తెలిపారు. నియోజకవర్గస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులు రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని రాజ్యాంగ నిర్మాణంపై ప్రసంగిస్తారని స్థానిక ఏ టి డబ్ల్యూ ఓ కూడా. వెంకటరమణ,స్థానిక ఎంఈఓ వంతల. త్రినాధరావు,రవ్వలగుడ గిరిజన సంక్షేమశాఖ బాలుర  ఆశ్రమ పాఠశాల హెచ్ఎం తెలగంజి. నాగేశ్వరరావు తెలిపారు. అమరావతిలో నవంబర్ 26వ తేదీ గురువారం నిర్వహించే వేడుకల్లో ప్రసంగించే గిరిజన విద్యార్థినీ,విద్యార్థులను ఇప్పటినుంచే తీర్చిదిద్దుతున్నామన్నారు. మెదడుకు పదును పెట్టి మండల,నియోజకవర్గ స్థాయిలలో జరిగే పోటీ పరీక్షల్లో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అధికారులు సూచించారు.