ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ఆత్మకూర్, మేజర్ న్యూస్: మీ గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కరివేన గ్రామంలో జెడ్పిటిసి అభ్యర్థి దంపతులు ఆదిలక్ష్మి బాయి, రవి నాయక్ ల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే బుడ్డా ముమ్మరగా సాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. మీ గ్రామాల్లో అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని, గ్రామాల అభివృద్ధి ప్రజల చేతిలోనే ఉందని అమూల్యమైన ఓటు వేసి కూటం అభ్యర్థులను గెలిపించి మీ గ్రామాలను మీరే అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.