BREAKING
గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం పత్తి రైతులను ఆదుకోండి - క్వింటాకి రూ 12,000-00 లు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి - టి డీ పీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి రూరల్ మండలంలో జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా స్పష్టం - జడ్పిటిసి అభ్యర్థిని షేక్ నాజియాకి మద్ధతుగా ప్రచారం విద్యార్థులకు సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్ ల పై అవగాహన పలమనేరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్

Select Suryaa Now
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ కాజల్ జైస్వాల్ సూచించారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం–2026 సందర్భంగా వికారాబాద్ పట్టణంలో సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్లాష్ మార్చ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లా డీ4సీ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ నెల పొడవునా “PAUSE FOR SAFETY – PAUSE. THINK. VERIFY.” అనే నినాదంతో వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, డిజిటల్ లావాదేవీల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాల ముగింపులో సైబర్ క్రైమ్ డీఎస్పీ కాజల్ జైస్వాల్ సమక్షంలో వికారాబాద్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో చిగుళ్లపల్లి గ్రౌండ్ నుంచి బసవేశ్వర చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు సైబర్ అవగాహన ఫ్లాష్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని అవగాహన కల్పించారు. ఏదైనా ఆన్‌లైన్ లావాదేవీ చేసే ముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించి, సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచించారు.సైబర్ నేరగాళ్ల మోసాలకు బలికాకుండా ప్రతి ఒక్కరూ సురక్షితమైన డిజిటల్ అలవాట్లను పాటించాలని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఫ్లాష్ మార్చ్ ద్వారా సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బంది, యువతీయువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.