ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు
హఫీజ్ పెట్,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లిలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జెండాను శేరిలింగంపల్లి మండల కార్యదర్శి తుపాకుల రాములు ఆవిష్కరించి, కార్మిక ఉద్యమ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్మికుల ఐక్యత, హక్కుల సాధన, శ్రమజీవుల సంక్షేమమే లక్ష్యంగా ఏఐటీయూసీ సాగిస్తున్న పోరాటాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు టి. రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఏఐటీయూసీ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని కాపాడాలని, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు జెండా ఆవిష్కరించి, కార్మిక ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలే మార్గమని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కే. వెంకటస్వామి, శేరిలింగంపల్లి మండల సీపీఐ కార్యదర్శి కె. చందు యాదవ్, ఏఐటీయూసీ శేరిలింగంపల్లి మండల అధ్యక్షులు బి. నారాయణ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. కొండలయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శులు ఎం. వెంకటేష్, జె. శ్రీనివాస్, ఏఐవైఎఫ్ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కె. శివకుమార్, కృష్ణ, అశోక్, బాలస్వామి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.