ముమ్మరంగా కూటమి జడ్పిటిసి అభ్యర్థి ముంగర మాధవి ప్రచారం
అనంతపురము రూరల్ మేజర్ న్యూస్ :
అనంతపురము రూరల్ మండల కూటమి జడ్పిటిసి అభ్యర్థి ముంగర మాధవి ఎన్నికల ప్రచారం శనివారం ముమ్మరంగా కొనసాగింది. మండల పరిధిలోని కక్కలపల్లి కాలనీ-3 ఎంపీటీసీ అభ్యర్థి పతకమూరి శ్రీనివాసులు, ఏ.నారాయణపురం-3 ఎంపీటీసీ పరిధిలో ఏ.నారాయణపురం-4 ఎంపీటీసీ అభ్యర్థి రాప రాధ , కామారుపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థి బోయ ఎల్లప్పతో .. కలసి.. ఆయా గ్రామాలలో.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామాలలో ప్రతి ఇంటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే... ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ సహకారంతో.. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.