గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు*
శిoగనమల మేజర్ న్యూస్: శిoగనమల మండలం కల్లుమడి ఎంపీటీసీ పరిధిలోని గుమ్మేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. కల్లుమడి ఎంపీటీసీ అభ్యర్థి ఎం. కృష్ణకు, జనసేన పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి పెద్దిరాజుకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ఎన్నికల సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులకు అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ అభ్యర్థి ఎం. కృష్ణను, జనసేన జడ్పీటీసీ అభ్యర్థి పెద్దిరాజుకు తమ అమూల్యమైన ఓటుతో మద్దతు అందించాలని కోరారు.
గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది. గుమ్మేపల్లిలో సైకిల్ ప్రచారం జోరందుకోవడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.