విరువూరు, పాపన్నగారిపల్లిలో కూటమి ప్రచార సందడి!
వరికుంటపాడు, మేజర్ న్యూస్ : వరికుంటపాడు మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. విరువూరు, పాపన్నగారిపల్లి గ్రామాల్లో ఉమ్మడి బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి మూలే హరితమ్మ శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి హాజరై అభ్యర్థితో కలిసి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఎన్నికల్లో మద్దతు కోరారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ఓటర్లతో మాట్లాడారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలే హరితమ్మకు తమ మద్దతు తెలియజేయాలని నాయకులు కోరారు. ప్రచారంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.