ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి
*చౌటుప్పల్, మేజర్ న్యూస్:* మండలంలోని దామెర గ్రామంలో సర్పంచ్ సాతిరి శ్రీధర్‌రావు అధ్యక్షతన ఎల్‌నినో అవగాహన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీలత మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుదల, ఉష్ణోగ్రతల పెరుగుదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వ్యవసాయం, పశుసంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పునూతల నర్సింహా, ఎంపీఓ, మిషన్ భగీరథ ఏఈ, పశువైద్యాధికారి, వ్యవసాయ ఏఈ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.