BREAKING
కుటుంబ కలహం.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య మహిళల్లో ఎముకల బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దృఢంగా మార్చుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు .శనివారం రాత్రి పట్టణంలోని గురజాడ కేంద్ర గ్రంధాలయం లో విజయభావన 568వసభ దాసోజు శ్రవణ్ పై చంద్రాయన్ గుట్ట పిఎస్ లో బోయ నగేష్ పిర్యాదు అట్టహాసంగా టిడిపి నేత శ్రీనివాసులు నాయుడు జన్మదిన వేడుకలు : శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు: రైన్ వాటర్ మ్యాన్ హోల్లలో పూడికతీత కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన -- 19వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఆరోగ్యకరమైన చిట్కాలు ఈ 4 సర్క్యూట్ సదస్సుకు ది ప్రీమియా అకాడమీ ఆతిథ్యం విద్యార్థులతో ప్రపంచ సవాళ్ల పరిష్కారాలకు యత్నం ప్రశాంత వాతావరణంలో జరగాలి బాధ్యతయుతంగా పని చేయాలి.. మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఎందుకు వస్తుంది? హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేడు ఏఐపీఎస్‌ఓ రంగారెడ్డి జిల్లా 4వ మహాసభ ఎన్టీఆర్ నగర్‌లోని టీఎన్‌జీఓఎస్ ఉద్యోగుల ఫోరం భవనంలో నిర్వహణ

వైభవంగా లింగ దీక్ష మహోత్సవాలు

Select Suryaa Now
వైభవంగా లింగ దీక్ష మహోత్సవాలు

జహీరాబాద;జహీరాబాద్‌ పట్టణంలోని సిద్దేశ్వరాలయంలో జంగమ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లింగ దీక్ష మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆరుద్రోత్సవాలు, పూర్ణాహుతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి కవితా దేవి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శిరీష సురేందర్‌ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ ఈవో శివ రుద్రప్ప, ఉత్సవ కమిటీ సభ్యులు, జంగమ సమాజం ప్రతినిధులు, మహిళలు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.లింగ దీక్ష మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉజ్జయిని జగద్గురువుల ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన, రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై జగద్గురువుల ఆశీస్సులు పొందాలని వారు కోరారు.