మీదివేములలో టీడీపీ ముమ్మర ప్రచారం
మీదివేములలో టీడీపీ ముమ్మర ప్రచారం
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె. వరలక్ష్మితో కలిసి నాయకులు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శరత్ రెడ్డి, ఎం. రామాంజనేయులు, కార్తీక్ రెడ్డి, భుగ్గా రాముడు, వెంకటేష్, గోవిందు, మేడం రాజు, లోకనాయుడు, చారు రాజు, మాజీ స్కూల్ చైర్మన్ రమేశ్వరుడు, ఆంజనేయులు, మధు, నాగార్జున మాదిగ, ఎర్రమాల మజ్జి, మాజీ సర్పంచ్ లక్ష్మన్న, లక్ష్మీదేవి, కృష్ణవేణమ్మ, గోవిందమ్మ, పుల్లయ్య, గొల్ల శేఖర్, వెంకట్రాముడు, ఉపేంద్ర, నాగశేషులు మాదిగ, కిట్టు, చెక్కల రామకృష్ణ, బీసన్నతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.