ప్రజాదరణతో ముందుకెళ్తున్న ఎన్డీయే కూటమి
- పొదిలి జెడ్పీటీసీ అభ్యర్థి మద్దుల శ్రీనివాసులు ఉధృత ప్రచారం
పొదిలి, మేజర్ న్యూస్;
ఎన్డీయే కూటమి జనసేన పార్టీ పొదిలి జెడ్పీటీసీ అభ్యర్థి మద్దుల శ్రీనివాసులు చేపట్టిన ఎన్నికల ప్రచారం తల్లమల్ల, గోగినేనిపాలెం గ్రామాల్లో హోరెత్తింది. శనివారం ఉదయం తల్లమల్ల గ్రామంలో శ్రీనివాసులు ఇంటింటా తిరుగుతూ ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు, ఊరూరా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్తూ ప్రజలకు వివరించారు.ఈ ప్రచార కార్యక్రమంలో వివిధ రాజకీయ విభాగాలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. రాష్ట్ర తెలుగుదేశం రైతు విభాగం కార్యదర్శి ఆవులూరి యలమంద, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి వరికుంట్ల అనిల్ మాజీ మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకటరెడ్డి, ఉప్పలపాడు సొసైటీ అధ్యక్షులు ఉలవ గోపి, మాజీ జెడ్పీటీసీ కాటూరి వెంకట నారాయణ బాబు మరియు తానికొండ వెంకట్రావు గ్రామీణ స్థాయి నాయకులను సమాయత్తం చేస్తూ ప్రచారాన్ని ముందుకు నడిపించారు.మహిళలు, మైనార్టీ వర్గాల మద్దతు కూడగట్టడంలో భాగంగా స్టేట్ బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీ బెల్లంకొండ విజయలక్ష్మి, జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ ఖాదర్ భాషా కల్లూరి సోమయ్య పప్పు గౌస్ బాషా బెల్లంకొండ శ్రీనివాస్ తలమల వెంకటరావు షేక్ యాసిన్ ప్రత్యేకంగా పర్యటించి ఎన్డీయే సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు.అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కల్లూరి సోమయ్య, గోగినేని రమణయ్య టిడిపి పట్టణ అధ్యక్షులు ముల్లా కుద్దూస్, డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు, శామంతపూడి నాగేశ్వరరావు, పోకూరి నరేష్, కల్లూరి రవికుమార్ రెడ్డి తదితరులు శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఇంటింటి ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. నాయకులు, కార్యకర్తల కోలాహలంతో తల్లమల్ల, గోగినేనిపాలెం గ్రామాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.