BREAKING
తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్ -పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘన సన్మానం త్వరలో మార్కో రూబియోతో బ్రెజిల్ విదేశాంగ మంత్రి భేటీ ఇందిరమ్మ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నీలం మధు ఘన నివాళులు హ్యాకింగ్ ఘటనలపై బినాన్స్ 90 శాతం దొంగిలించబడిన అసెట్స్ రీప్లేస్ చేసినట్లు వెల్లడి ప్రజా రక్షణలో సుదీర్ఘ సేవలు.. ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావుకు ఘన వీడ్కోలు విష్ణుకు అభినందించిన గ్రామ సర్పంచ్ రాధిక ఏసయ్య ఖతార్ మధ్యవర్తులతో ఇరాన్ రాయబారుల రహస్య భేటీ కొనుగోలు కేంద్రం ప్రారంభించండి మహాప్రభో నాగు పాము దర్శనం... భక్తుల్లో ఆధ్యాత్మిక ఆనందం పరిటాల సునీతమ్మ స్ఫూర్తితో రామగిరిలో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్

Select Suryaa Now
గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్

జీలుగుమిల్లి, మేజర్ న్యూస్:జీలుగుమిల్లి గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తానని  స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థిగా  తన ఎన్నికల గుర్తు " కుండ "గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని  స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ ప్రజలను కోరారు. శనివారం జీలుగుమిల్లిలోని ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రసారం చేశారు. ఈ సందర్భంగా చాట్రాతి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామానికి అనే మౌలిక వసతులు అవసరమని వాటన్నిటిని దశలవారీగా సమకూరుస్తానని ఎన్నికల్లో ప్రసారం చేశారు. తమ కుటుంబ సభ్యులు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా జీవిస్తున్నామని ప్రకటించారు. శ్రీ జగదంబ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గా పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. అలాగే  మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందించి గ్రామంపై తనకున్న మమకారాన్ని  చాటుకున్నానని అన్నారు. జీలుగుమిల్లి ప్రజలు ఎంపీటీసీ గా అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండపల్లి దుర్గాప్రసాద్, బుగ్గల శివరాం, గుజ్జు ప్రసాద్, కోలా లక్ష్మణ్,  కోర్ల  రామయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ బొంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా