BREAKING
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ బ్రాహ్మణపల్లె, తిప్పాయపల్లెలో టీడీపీ ప్రచారం దేశ ఐక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి గుండెపోటుతో యువకుడు మృతి -- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, గడ్డ మణుగు రవికుమార్ మెదక్ జిల్లాలో మనోహరాబాద్ ఒక్కటే కరువు పీడిత మండలం గ్రామానికి మౌలిక వసతులు సమకూరుస్తా -- స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి చాట్రాతి ప్రసాద్ గుమ్మేపల్లిలో జోరందుకున్న సైకిల్ ప్రచారం – అభ్యర్థులకు ప్రజల మద్దతు కోరిన నాయకులు* రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో మెదక్ విద్యార్థినికి ప్రథమ స్థానం ఎల్‌నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి వన్యప్రాణులను వేటాడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్* * రెండు తుపాకులు, 37 ఇనుప గుండ్లు స్వాధీనం… వన్యప్రాణుల మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు-సీఐ నాగరాజు, ఎస్సై రాజేష్ కుమార్..* పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి బ్రిడ్జి నిర్మాణానికి మట్టి నమూన సేకరణ... మట్టి నమూన పనుల పరిశీలిస్తున్న ఆర్ అండ్ బి అధికారులు... మధుర నగర్ వెంచర్ ప్లాట్ల వివాదం.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు

ముందస్తు గుర్తింపే రొమ్ము క్యాన్సర్‌కు సరైన రక్ష: కిమ్స్ వైద్య నిపుణులు

Select Suryaa Now
ముందస్తు గుర్తింపే రొమ్ము క్యాన్సర్‌కు సరైన రక్ష: కిమ్స్ వైద్య నిపుణులు

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ :  మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై విస్తృత అవగాహన పెంపొందించడం, ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా నెల్లూరులోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ కడల్స్ సంయుక్త ఆధ్వర్యంలో 'పింక్ అక్టోబర్' ముగింపు సందర్భంగా భారీ అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 1,000 మందికి పైగా మహిళలు, విద్యార్థినులు ఉత్సాహంగా హాజరయ్యారు.
కార్యక్రమంలో కిమ్స్ వైద్య నిపుణులు ప్రసంగిస్తూ, రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే అత్యాధునిక చికిత్సా విధానాల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని స్పష్టం చేశారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి నెలా స్వీయ రొమ్ము పరీక్ష  చేసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
మహిళలను ఉత్తేజపరుస్తూ కేవలం వైద్యపరమైన అంశాలకే పరిమితం కాకుండా పలు సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా వీణ, సంగీత విభావరి, భరతనాట్యం, క్యాన్సర్ అవగాహనపై మైమ్ ప్రదర్శనలతో పాటు రొమ్ము ఆరోగ్యంపై నిర్వహించిన క్విజ్ పోటీలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని, సిబ్బందిని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు, డైరెక్టర్ బొల్లినేని అద్విక్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కిమ్స్ కడల్స్ యూనిట్ సి.ఓ.ఓ డాక్టర్ రోహిణి ప్రియ లక్ష్మి, రీజనల్ సి.ఓ.ఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వంచితో పాటు కిమ్స్ వైద్య నిపుణులు, ఆసుపత్రి మహిళా సిబ్బంది పాల్గొన్నారు.